![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఆమెకు శునకాలంటే పిచ్చి ప్రేమ. ఏ మూగజీవానికి హాని జరిగినా ఊరుకోదు. అలాంటి రష్మీ దగ్గర ఒకప్పుడు చుట్కి అనే పెట్ డాగ్ ఉండేది. దాంతో చేసిన అల్లరి మొత్తాన్ని కూడా రష్మీ ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసేది. ఐతే అది కొంతకాలం క్రితం చనిపోయింది. ఇక రష్మీ తన పెట్ డాగ్ అస్థికలను గోదావరి నదిలో కలిపేసింది. ఆ వీడియోని అలాగే తన చుట్కితో గడిపిన క్షణాల వీడియోస్ ని కూడా పోస్ట్ చేసింది. "ఒక జీవిత కాలం పాటు నీ ప్రేమను నేను మిస్ అవుతూనే ఉంటాను. పునర్జన్మ అనేది ఉంటే గనక ఎలాంటి బాధా లేకుండా పుట్టాలని కోరుకుంటున్నాను.
నీ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినందుకు నన్ను క్షమించు..ఇక ప్రశాంతంగా మరో లోకానికి వేళ్ళు..చుట్కి గౌతమ్" అంటూ ఒక హార్ట్ టచింగ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రష్మీ. ఇక నెటిజన్స్ ఐతే "ఇలాంటి మనిషిని నా జీవితంలో చూడలేదు..ఓం శాంతి చుట్కి బేటా. జంతువుల మీద మీరు చూపించే ప్రేమ గొప్పది" అంటూ మెసేజెస్ ఇస్తున్నారు. ఇక రష్మీ ఈటీవీ షోస్ తో బాగా పాపులర్ అయ్యింది. ఇక బుల్లితెర మీద హిట్ పెయిర్ గా నిలిచింది. ఈ జంట పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే వీళ్ళు పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది కానీ తర్వాతి కాలంలో వీళ్ళు విడిపోయారు.. ఐతే వీళ్ళు మళ్ళీ కలవాలని ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు.
![]() |
![]() |